అక్టోబర్ 22, 2024

స్టడీ లీవ్


శాశ్వత గజిటెడ్ ఉద్యోగులకు ఈ నిబంధన వర్తిస్తుంది.

తన విధి నిర్వహణ లో ఉపయోగపడే శాస్త్ర, సాంకేతక అంశాలను చదవటానికి ఈ సెలవు మంజూరు చేయవచ్చు.

కనీస సర్వీస్ ఐదేళ్ళు ఉండాలి.

పదవీ విర్రమణ మూడేళ్ళు లోపు ఉన్న వాళ్ళు అనర్హులు.

ఒకేసారి 12 నెలలు మంజూరు చేయవచ్చు. 

సర్వీస్ మొత్తంలో గరిష్టంగా రెండేళ్ళు సెలవు పొందవచ్చు.

దీనిని మంజూరు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది.

ఈ సెలవు సమయంలో సగం జీతం చెల్లించబడుతుంది.

దీనిని ఇతర సెలవులతో కలిపి వాడుకొనవచ్చును. 

గరిష్టంగా అన్ని రకాల సెలవులు కలిపి 28 నెలలు మించకూడదు. 

మొదటి తరం SC & ST నాన్ గజెటెడ్ ఉద్యోగులు పూర్తి జీత భత్యాలతో రెండేళ్ళ వరకు సెలవు పొందవచ్చు. (GO MS NO.342)


5 కామెంట్‌లు: