అసాధారణ సెలవు (EOL)
తాత్కాలిక మరియు శాశ్వత ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. గరిష్టంగా ఐదేళ్ళు ఉపయోగించుకొనవచ్చును వ్యక్తిగత మరియు వైద్య కారణాలపై ఉపయోగించుకొనవచ్చును. అసాధారణ సెలవు కాలానికి ఎటువంటి వేతనం చెల్లించబడదు. వైద్య కారణాలపై ఈ సెలవు ఉపయోగించుకొన్నచో ఇంక్రిమెంట్ లకు, పెన్షన్ కొరకు పరిగణించ బడుతుంది. వ్యక్తిగత కారణాలపై ఈ సెలవు ఉపయోగించుకొన్నచో ఇంక్రిమెంట్ లకు పరిగణించ బడదు. పెన్షన్ కొరకు గరిష్టంగా మూడేళ్ళ వరకు పరిగణించబడుతుంది. ఎన్ని రోజులు అసాధారణ సెలవులో ఉంటె అందులో 10 వ వంతు సంపాదిత సెలవు తగ్గించ బడుతుంది. ఏ ఇతర సెలవులు అందుబాటులో లేకపోతె ఈ సెలవు ఉపయోగించుకొనవచ్చును. ఇతర సెలవులు ఉన్నప్పటికీ ఉద్యోగి కోరితే మంజూరు చేయవచ్చును. ఉద్యోగి గైర్హాజరు అయిన కాలాన్ని డైస్ నాన్ లేదా అసాధారణ సెలవుగా పరిగణించవచ్చును. ఎ రకమైనా సెలవుతో కలిపినా గరిష్టంగా ఐదేళ్ళ వరకు ఉపయోగించుకొనవచ్చును క్షయ మరియు కుష్టు వ్యాధుల వైద్యం కొరకు 18 నెలల వరకు మంజూరు చేయవచ్చును కాన్సర్ మరియు మానసిక అనారోగ్యం కొరకు శాఖాధిపతి 12 నెలల వరకు మంజూరు చేయవచ్చును. SC మరియు ST లకు చదువు కొరకు 24 నెలల వరకు శాఖాధిపతి మంజూరు ...
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి