( See Circular Memo No.14781-C/278/FR.I/2011, Dt.22.06.2011 Finance Department ) G.O.Ms.No. 238 ఆర్ధిక శాఖ, తేదీ.13.08.1969 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లోని గజిటెడ్ మరియు నాన్ గజిటెడ్ ఉద్యోగులు, తమకు నిల్వ ఉన్న సంపాదిత సెలవు (Earned Leave) ని సరెందర్ చేసుకుని దానికి సమానమైన లీవ్ శాలరీ పొందే అవకాశం కల్పించ బడింది.తదుపరి నాల్గవ తరగతి ఉద్యోగులకు కూడా ఈ అవకాశం కల్పించ బడింది. (సర్క్యులర్ మెమో నెం.52729-A/681/69-1, 11.10-1969 ఆర్ధిక శాఖ) రాష్ట్ర ప్రభుత్వం లో డిప్యుటేషన్ పై పని చేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులకు మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఇలా సరెండర్ చేయడం ద్వారా నగదు చెల్లించదు. (G.O.Ms.No. 211 ఆర్ధిక శాఖ, తేదీ.10.04.1972) ఫారిన్ సర్వీసు డిప్యుటేషన్ లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సరెందర్ లీవ్ మాతృ శాఖ చెల్లించాలి. (ఫారిన్ ఎంప్లాయర్ లీవ్ శాలరీ కంట్రిబ్యూషన్ చెల్లించాల్సి ఉంటుంది) ఎప్పుడు వినియోగించు కొనవచ్చును 12 నెలల విరామంతో 15 రోజులు, 24 నెలల విరామం తో 30 రోజులు సరెండర్ చేసుకొన వచ్చును. తాత్కాలిక ఉద్యోగులు 24 నెలల విరామం తో 15 రోజులు...
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి