ఫిబ్రవరి 21, 2025

మెడికల్ రీయంబర్స్మెంట్ క్లెయిమ్ ఎలా పొందాలి.

  • ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్, 1972 ప్రకారం ఉద్యోగులు, పింఛనుదారులు తమకు, తమ కుటుంబ సభ్యులకు అయిన వైద్య ఖర్చులను ప్రభుత్వం నుండి పొందవచ్చు. 
  • ఈ సౌకర్యం పొందటానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్ వారు నుండి గుర్తింపు పొందిన రిఫరల్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది.
  • ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో నాన్ రెఫరల్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకుని ఉంటే ఆ పరిస్థితులను, కారణాలను వివరిస్తూ proper channel లో దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది. (రోడ్డు ఆక్సిడెంట్ లు, హార్ట్ ఎటాక్, స్ట్రోక్ మొదలైన అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు)
  • మెడికల్ రేయంబర్స్మెంట్ గరిష్ట పరిమితి 2 లక్షలు (ఒకసారి ట్రీట్మెంట్ కు).
  • 2 లక్షల కు మించి క్లెయిమ్ కావాలి అనుకుంటే ప్రోపర్ ఛానెల్ లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది. 
  • క్లెయిమ్ మొత్తం 50000 కంటే లోపు ఉన్నట్లయితే ఆ క్లెయిమ్ నీ డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ వారు స్క్రూటినీ చేయాల్సి ఉంటుంది. స్క్రూటినీ అయిన తదుపరి మంజూరు చేస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చే అధికారం సంబంధిత శాఖ కు చెందిన జిల్లా అధికారికి ఉంటుంది.
  • క్లెయిమ్ మొత్తం 50000 కంటే ఎక్కువ ఉన్నట్లయితే స్క్రూటినీ కొరకు EHS ట్రస్ట్ వారికి పంపవలసి ఉంటుంది. స్క్రూటినీ అయిన తదుపరి మంజూరు చేస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చే అధికారం సంబంధిత శాఖాధిపతి కు ఉంటుంది.

50000 లోపు మెడికల్  రీయింబర్స్మెంట్ క్లైమ్ చేసుకునే విధానం

  • ఇవి off-line మోడ్ లో చేయాల్సి ఉంటుంది.
  • నిర్దేశిత ఒరిజినల్ డాక్యుమెంట్స్ నీ ఉద్యోగి పని చేసే కార్యాలయం ద్వారా సంబంధిత జిల్లా అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. 
  • సంబంధిత జిల్లా అధికారి నుండి స్క్రూటినీ కొరకు డిస్ట్రిక్ట్  కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ కు పంపాలి.
  • ప్రభుత్వ నిర్దేశించిన ధరల ప్రకారం డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ స్క్రూటినీ చేసి ఎంత మొత్తం మంజూరు చేయవచ్చునో తెలుపుతూ జిల్లా అధికారి వారికి పంపుతారు.
  • స్క్రూటినీ చేసి ఆమోదించిన మొత్తానికి సంబంధిత జిల్లా అధికారి వారు మంజూరు చేస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేయాల్సి ఉంటుంది.

50000 కంటే ఎక్కువ మొత్తం కలిగిన మెడికల్ రీయింబర్స్మెంట్ క్లైమ్ చేసుకునే విధానం

  • ఇది EHS సైట్ ద్వారా ఉద్యోగి తన లాగిన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దీనికి ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది. ఆ రిఫరెన్స్ నంబర్ ను మెన్షన్ చేస్తూ నిర్దేశించిన ఫిజికల్ డాక్యుమెంట్స్ (ఒరిజినల్ అన్నీ) తాను పని చేసే కార్యాలయ అధికారికి సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన క్లెయిమ్ DDO లాగిన్ లోకి చేరుతుంది.
  • కార్యాలయ అధికారి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ నీ జిల్లా అధికారి ద్వారా శాఖాధిపతి కు సబ్మిట్ చేయాలి. శాఖాధిపతి  EHS ట్రస్ట్ కు ఫార్వర్డ్ చేస్తున్నట్లుగా ఒక లేఖ ను జారీ చేస్తారు.
  • శాఖాధిపతి జారీ చేసిన ఆ లేఖను DDO లాగిన్ లో పెండింగ్ ఉన్న క్లెయిమ్ కు జటపరచి ఆ క్లెయిమ్ నీ ఫార్వర్డ్ చేస్తే అది EHS ట్రస్ట్ కు చేరుతుంది.
  • ప్రభుత్వ నిర్దేశించిన ధరల ప్రకారం EHS ట్రస్ట్ వారు స్క్రూటినీ చేసి ఎంత మొత్తం మంజూరు చేయవచ్చునో తెలుపుతూ జిల్లా అధికారి వారికి పంపుతారు.
  • స్క్రూటినీ చేసి ఆమోదించిన మొత్తానికి సంబంధిత శాఖాధిపతి వారు మంజూరు  చేస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేయాల్సి ఉంటుంది.

ట్రెజరీ కి బిల్ సబ్మిట్ చేసే విధానం

  • శాఖాధిపతి/ జిల్లా అధికారి వారు మంజూరు  చేసిన మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్ CFMS ద్వారా ట్రెజరీ కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
  • ఉద్యోగి కి జీతం చెల్లించే పద్దులోనే 010/017 ఆబ్జెక్ట్ హెడ్స్ లో ఈ క్లెయిమ్ సమర్పించాలి.
  • ఈ క్లెయిమ్ సబ్మిట్ చేయడానికి CFMS లో వర్క్ ఫ్లో ద్వారా మేకర్, చెక్కర్ (ఆప్షనల్), సబ్మిటర్ రోల్స్ నీ అసైన్ చేసుకోవాల్సి ఉంటుంది. (వన్ టైమ్ టాస్క్)
  • మేకర్ లాగిన్ లో HR క్లెయిమ్స్ లో మెడికల్ రీయంబర్స్మెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని క్లైమ్ DDO కు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. DDO ఆ క్లెయిమ్ నీ ట్రెజరీ కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
  • ట్రెజరీ లో ఆమోదం పొందిన తదుపరి, అర్ధిక శాఖ వారు ekuber (RBI) ద్వారా  ఉద్యోగి ఖాతాకు ఆ మొత్తం జమ చేస్తారు.

మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్ కు కావలసినవి

  1. దరఖాస్తు 
  2. సర్టిఫికెట్ - ఎ (ఔట్ పేషెంట్ లకు మాత్రమే)
  3. చెక్ లిస్ట్
  4. డిపెండెంట్ సర్టిఫికెట్ (కుటుంబ సభ్యుల వైద్యం నిమిత్తం) - ఉద్యోగి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి.
  5. ఎమర్జెన్సీ సర్టిఫికెట్ (హాస్పిటల్ నుండి పొందాలి)
  6. ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ (హాస్పిటల్ నుండి పొందాలి)
  7. డిశ్చార్జ్ సమ్మరీ (హాస్పిటల్ నుండి పొందాలి)
  8. ఒరిజినల్ బిల్లులు (హాస్పిటల్ నుండి పొందాలి. క్లెయిమ్ మొత్తానికి సరిపోవాలి)
  9. నాన్ డ్రాయల్ సర్టిఫికెట్ (DDO/ కార్యాలయ అధికారి ఇవ్వాలి)
  10. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వారు రెఫరల్ హాస్పిటల్ గా గుర్తిస్తూ ఇచ్చిన లేఖ (హాస్పిటల్ నుండి పొందాలి)

3 కామెంట్‌లు:

  1. నేను sachivalayam employees ని Mahila police maku శాఖాధిపతి అంటే eavaru vastaru sir 50000 లోపు అంటే ఎలా process cheppagalaru

    రిప్లయితొలగించండి
  2. నా భార్య వారి నాన్న గారి EHS కార్డు లో ఉంది, వయసు 27.. మే నెలలో డెలివరీ ఉంది, ప్రస్తుతం ఉన్న వారి నాన్న గారి కార్డు ద్వారా EHS హాస్పిటల్ కు వెళ్లవచ్చా? లేదా నా EHS కార్డు లో నమోదు చేసుకొని ట్రీట్మెంట్ కు వెళ్లాల? నా కార్డు లోకి నా భార్య ను ఎలా నమోదు చేసుకోవాలి??

    రిప్లయితొలగించండి