ప్రభుత్వ సేవల్లో పూర్తి డిజిటలీకరణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, సామర్థ్యం, ప్రజలకు అందుబాటును మరింత పెంచే లక్ష్యంతో అన్ని శాఖలు ఎండ్-టు-ఎండ్ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీకి తక్షణమే మారాలని ఆదేశిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.  ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ గారు 2025 మే 22న G.O.Rt.No.42 విడుదల చేశారు. 

జీవోలోని ముఖ్యాంశాలు
  • ప్రభుత్వ శాఖలన్ని ఇకపై తప్పనిసరిగా ఈ కింది మార్గదర్శకాలను పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
  • ప్రతి సేవను ఆన్‌లైన్‌లోనే అందించాలి. దరఖాస్తు సమర్పణ దగ్గరనుండి, అంతర్గత ప్రక్రియలు పూర్తి చేసి తుది సేవను అందించే వరకు ప్రతి దశ డిజిటల్‌లోనే జరగాలి. మాన్యువల్ విధానాలకు ఇకపై తావులేదు. 
  • ప్రభుత్వ శాఖలన్నింటిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వ్యవస్థలు, వర్క్‌ఫ్లో ఆటోమేషన్ టూల్స్ వాడటం ద్వారా పారదర్శకత పెంచాలి. 
  • ఈ విధానం ప్రభుత్వం నుండి ప్రభుత్వానికి (G2G), ప్రభుత్వం నుండి పౌరులకు (G2C), ప్రభుత్వం నుండి వ్యాపారానికి (G2B) అందించే అన్ని రకాల సేవలకు వర్తిస్తుంది. 
  • ఏదైనా శాఖకు సొంత వనరులు లేకపోతే, CEO RTGS వాటిని సమకూరుస్తారు. 
  • ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందిస్తున్న సర్టిఫికేట్ జారీ చేయడం, ఫిర్యాదుల స్వీకరణ, స్టేటస్ ట్రాకింగ్ వంటి సేవలను మన మిత్ర వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం చేయాలి. 
ఈ ఆదేశాల అమలు మరియు పర్యవేక్షణ కోసం, అన్ని శాఖలు ఈ క్రింది డేటాను 2025 మే 30 నాటికి IT, E&C శాఖకు ఇమెయిల్ ద్వారా పంపాలని కోరారు. 
  1. శాఖ పేరు మరియు స్థాయి (రాష్ట్రం/HOD/ప్రాంతీయ/జిల్లా/మండలం/గ్రామం) 
  2. ఆన్‌లైన్ సేవలు, మాన్యువల్ సేవలు, సిటిజెన్ సర్వీస్ సెంటర్ల ద్వారా అందించే సేవల వివరాలు పట్టిక రూపంలో అందజేయాలి. 
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పౌరులకు సేవలను మరింత చేరువ చేయడమే కాకుండా, ప్రభుత్వ కార్యకలాపాల్లో జవాబుదారీతనం పెంచుతుందని భావిస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మెడికల్ రీయంబర్స్మెంట్ క్లెయిమ్ ఎలా పొందాలి.

అసాధారణ సెలవు (EOL)

Surrender of Earned Leave

గ్రామ/వార్డు సచివాలయాల హేతుబద్ధీకరణ మరియు బదిలీలు

Child Care Leave (Andhra Pradesh)

స్టడీ లీవ్

సంపాదిత సెలవు (EL)

ప్రభుత్వ కార్యాలయాల్లో మానవ వనరుల నిర్వహణను బలోపేతం చేయడానికి వెబ్ పోర్టల్ అమలు

Andhra Pradesh Leave Rules, 1933

INCREMENT ARREAR BILL