జూన్ 21న జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో భారీ వేడుకను నిర్వహించనుంది. ఈ ఏడాది యోగా దినోత్సవం యొక్క థీమ్ "యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్". ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా యోగా కార్యక్రమం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. 2023లో సూరత్‌లో 1.53 లక్షల మంది పాల్గొన్న రికార్డును అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 కోట్ల మంది ప్రజలు గ్రామ, వార్డు, మండల మరియు జిల్లా కేంద్రాల్లో సామూహిక యోగా సెషన్స్‌లో పాల్గొననున్నారు. విశాఖపట్నంలో ఆర్కే బీచ్ మరియు భీమిలి తీరం వెంబడి ప్రధాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు దక్కేలా చూసేందుకు భీమిలి నుండి శ్రీకాకుళం వరకు తీరం వెంబడి యోగా సెషన్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తోంది. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి మరియు గిన్నిస్ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించడానికి, APIIC MD శ్రీ M. అభిషిక్త్ కిషోర్, IAS, మరియు APTS MD శ్రీ సూర్య తేజ, IAS, లను నోడల్ అధికారులుగా ప్రభుత్వం నియమించింది.
జీవో కొరకు క్లిక్ చేయండి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి