- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కొరకు 01.11.1984 నుండి గ్రూప్ ఇన్సూరెన్స్ పధకాన్ని ప్రారంభించింది.
- APSEGIS గా పిలువబడే ఈ పధకాన్ని ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 29౩ (ఆర్ధిక శాఖ), తేదీ 08.10.1984 ద్వారా అమలు లోకి తీసుకు వచ్చింది.
- రాష్ట్ర ప్రభుత్వం లోని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ మరియు నాల్గవ తరగతి ఉద్యోగులు అందరూ దీనికి అర్హులు.
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క టైం స్కేల్ ఆధారంగా దిగువ పేర్కొన్న విధంగా చందాను జమ చేయాలి.
ఆంధ్ర ప్రదేశ్
పే స్కేల్ | గ్రూప్ | చందా 01.11.1994 | ఇన్సూరెన్స్ మొత్తం |
54060 - 140540 అంతకన్నా పై స్కేల్ వారికి | A | 120 (8 యూనిట్లు) | 120000 |
35570 - 109910 నుండి 48440 - 137220 వరకు | B | 60 (4 యూనిట్లు) | 60000 |
25220 - 80910 నుండి 34580 - 107210 వరకు | C | 30 (2 యూనిట్లు) | 30000 |
20000 - 61960 నుండి 23780 - 76730 వరకు | D | 15 (1 యూనిట్) | 15000 |
తెలంగాణా
పే స్కేల్ | గ్రూప్ | చందా 01.11.1994 | ఇన్సూరెన్స్ మొత్తం |
51320 - 127310 అంతకన్నా పై స్కేల్ వారికి | A | 120 (8 యూనిట్లు) | 120000 |
33750 - 99310 నుండి 45960 - 124150 వరకు | B | 60 (4 యూనిట్లు) | 60000 |
24280 - 72850 నుండి 32810 - 96890 వరకు | C | 30 (2 యూనిట్లు) | 30000 |
19000 - 58850 నుండి 22900 - 69150 వరకు | D | 15 (1 యూనిట్) | 15000 |
- ఒక యూనిట్ విలువ రూ.15.
- అందులో రూ. 4.50 ఇన్సూరెన్స్ భాగం. మిగిలినది సేవింగ్స్ భాగం.
- ప్రతీ నెల జీతంలో సెలవులో ఉన్నా , సస్పెన్షన్ ఉన్న సరే గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రీమియం రికవరీ చెయ్యాలి. జీతం లేని సెలవు లో ఉన్నపటికీ ఉద్యోగి విధుల్లో చేరిన తరువాత గరిష్టంగా మూడు వాయిదాలు దాటకుండా రికవరీ చెయ్యాలి.
- ప్రతీ ఉద్యోగి తన కుటుంబ సభ్యులలో ఒకరిని నామినేట్ చెయ్యాలి.
- కుటుంబ సభ్యులు ఎవరూ లేనట్లయితే తనకు నచ్చిన వ్యక్తిని నామినేట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఉద్యోగి కి కుటుంబం ఏర్పడుతుందో తప్పనిసరిగా ఆ కుటుంబం లోని వ్యక్తిని తిరిగి నామినేట్ చేయవలసి ఉంటుంది.
- ఒకరి కన్నా ఎక్కువ కుటుంబ సభ్యులను కూడా నామినేట్ చేయవచ్చు. వారిలో ఎవరి వాత ఎంత అనేది తప్పని సరిగా తెలియ పరచాలి.
- ఇచ్చిన నామినేషన్ ను ఎప్పుడైనా మార్చుకోవచ్చు.
- ఒకవేళ నామినేషన్లు ఇచ్చి ఉండక పొతే అతని కుటుంబ సభ్యుసభ్యుల కు సమాన వాటాలలో చెల్లించవలెను.
- భార్య లేక భర్త, తల్లిదండ్రులు, పిల్లలు, మైనర్లు అయిన సోదరులు, సోదరీమణులు, చనిపోయిన కొడుకు యొక్క భార్య మరియు యొక్క పిల్లలు కుటుంబ సభ్యులుగా వ్యవహరించాలి.
- కార్యాలయ అధికారి లేదా DDO ప్రతీ ఉద్యోగి యొక్క సర్వీసు బుక్ నందు 31.10.1984 నాటి ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ యొక్క బాలన్స్, ఉద్యోగి ఎన్రోల్ అయిన గ్రూప్, జమ చేస్తున్న చందా విలువ, ఎప్పటినుండి చందా ప్రారంభించిన తేదీ, నామినేషన్ వివరములు నమోదు చేయాలి. ప్రతీ సంవత్సరం గ్రూప్ ఇన్సూరెన్స్ రికవేరి చేసినట్లు గా సర్వీస్ రిజిస్టర్ లో నమోదు చేయాలి.
- ఉద్యోగి రిటైర్ అయిన సందర్భం లో, చనిపోయిన సందర్భంలో, ఉద్యోగి జాడ తెలియని సందర్భంలో (నిబంధనల మేరకు) గ్రూప్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.
- ఉద్యోగి రిటైర్ అయినపుడు సేవింగ్స్ ఫండ్ మొత్తం మరియు దానిపై వడ్డీ కలిపి ఉద్యోగికి చెల్లిస్తారు. దీని కొరకు ప్రభుత్వం ప్రతీ సంవత్సరం జి.వో విడుదల చేయటం జరుగుతుంది. ఉద్యోగి చనిపోయిన సందర్భంలో కూడా నామినీలకు లేదా కుటుంబ సభ్యులకు ఇదే విధంగా చెల్లించవలెను.
- ఉద్యోగి చనిపోయిన సందర్భంలో ఇన్సూరెన్స్ మొత్తాన్ని నామినీలకు కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు.
- ఉద్యోగి కనిపించని సందర్భంలో
- ఒక సంవత్సరం తరువాత సేవింగ్స్ ఫండ్ మొత్తం వడ్డీ తో సహా నామినీలకు కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు
- ఏడు సంవత్సరాల తరువాత ఇన్సూరెన్స్ మొత్తాన్ని నామినీలకు లేదా కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు.
- తప్పని సరిగా పొలిసు కంప్లైంట్ ఇచ్చి not traced సర్టిఫికేట్ పొందవలెను. ఉద్యోగి ఆచూకి తెలిస్తే తిరిగి చెల్లిస్తామని ఇండెమ్నిటి బ్యాండ్ సమర్పించాలి.
- ఒక సంవత్సరం పాటు సేవింగ్స్ ఫండ్ మరియు ఇన్సూరెన్స్ ఫండ్ రికవరీ చెయ్యాలి.
- తదుపరి ఆరు సంవత్సరాల పాటు ఇన్సూరెన్స్ ప్రీమియం ని రికవరీ చెయ్యాలి.
- కార్యాలయ అధికారి గజెటెడ్ అయితే కార్యాలయం లో పనిచేసే ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ మంజూరు చేయవచ్చును. నాన్ గెజిటెడ్ అయితే కనుక అయన పై స్థాయి గజిటెడ్ అధికారి మంజూరు చేయవచ్చును.
- కార్యాలయ అధికారులకు అయన పై స్థాయి అధికారులు మంజూరు చేయవచ్చును.
- శాఖాధిపతులకు సంబంధిత శాఖ ప్రభుత్వ కార్యదర్శి మంజూరు చేయవచ్చును.
- ఫారిన్ సర్వీస్ లో ఉన్న ఉద్యోగికి అతని మాతృ శాఖ యొక్క శాఖాధిపతి మంజూరు చేయవచ్చును.
ఆంధ్ర ప్రదేశ్ తాజా GIS పట్టికల కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి
తెలంగాణా తాజా GIS పట్టికల కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి