- తాత్కాలిక మరియు శాశ్వత ఉద్యోగులందరికీ వర్తిస్తుంది.
- గరిష్టంగా ఐదేళ్ళు ఉపయోగించుకొనవచ్చును
- వ్యక్తిగత మరియు వైద్య కారణాలపై ఉపయోగించుకొనవచ్చును.
- అసాధారణ సెలవు కాలానికి ఎటువంటి వేతనం చెల్లించబడదు.
- వైద్య కారణాలపై ఈ సెలవు ఉపయోగించుకొన్నచో ఇంక్రిమెంట్ లకు, పెన్షన్ కొరకు పరిగణించ బడుతుంది.
- వ్యక్తిగత కారణాలపై ఈ సెలవు ఉపయోగించుకొన్నచో ఇంక్రిమెంట్ లకు పరిగణించ బడదు. పెన్షన్ కొరకు గరిష్టంగా మూడేళ్ళ వరకు పరిగణించబడుతుంది.
- ఎన్ని రోజులు అసాధారణ సెలవులో ఉంటె అందులో 10 వ వంతు సంపాదిత సెలవు తగ్గించ బడుతుంది.
- ఏ ఇతర సెలవులు అందుబాటులో లేకపోతె ఈ సెలవు ఉపయోగించుకొనవచ్చును. ఇతర సెలవులు ఉన్నప్పటికీ ఉద్యోగి కోరితే మంజూరు చేయవచ్చును.
- ఉద్యోగి గైర్హాజరు అయిన కాలాన్ని డైస్ నాన్ లేదా అసాధారణ సెలవుగా పరిగణించవచ్చును.
- ఎ రకమైనా సెలవుతో కలిపినా గరిష్టంగా ఐదేళ్ళ వరకు ఉపయోగించుకొనవచ్చును
- క్షయ మరియు కుష్టు వ్యాధుల వైద్యం కొరకు 18 నెలల వరకు మంజూరు చేయవచ్చును
- కాన్సర్ మరియు మానసిక అనారోగ్యం కొరకు శాఖాధిపతి 12 నెలల వరకు మంజూరు చేయవచ్చును.
- SC మరియు ST లకు చదువు కొరకు 24 నెలల వరకు శాఖాధిపతి మంజూరు చేయవచ్చును.
- వైద్య కారణాలపై మంజూరు చేయబడిన అసాధారణ లీవ్ కాలాన్ని ఇంక్రిమెంట్ కొరకు పరిగణిస్తూ శాఖాధిపతి అనుమతి ఇవ్వవచ్చును. ఆరు నెలల కంటే ఎక్కువ సమయానికి అయితే ప్రభుత్వం అనుమతి ఇవ్వగలదు.
సర్ నేను వెల్ఫేర్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను
రిప్లయితొలగించండి5 months కి మెడికల్ లీవ్ పెట్టుకుంటే మెడికల్ సర్టిఫికెట్ తో పాటు లెటర్ Mpdo కి మా aswo
కి ఒకసారి సబ్మిట్ చేస్తే సరిపోతుందా లేదా ప్రతి నెల లెటర్ పంపించాలా సర్
ఒక ఉద్యోగి జనవరి 2001 లో ఇంక్రిమెంట్ తీసుకున్నట్టయితే అతను ఆ ఇంక్రిమెంట్ తర్వాత 385 రోజులు మెడికల్ గ్రౌండ్స్ లో శాంక్షన్ అయితే అతను నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ తేదీ క్యాలిక్యులేషన్ ఎలా చేయగలరు తెలుపగలరు
రిప్లయితొలగించండిEmployee has taken leave without obtaining permission from1st march to 8th april 25(39 days) and joined 9th april 25.how to claim EOL.
రిప్లయితొలగించండి