నవంబర్ 24, 2024

Paternity Leave

  • ఉద్యోగి భార్య డెలివరీ సందర్భంగా పురుష ఉద్యోగి 15 రోజుల paternity leave ఉపయోగించుకొనవచ్చును.
  • దీనికి పూర్తి జీతభత్యాలు చెల్లించబడతాయి.
  • డెలివరీ కి 15 రోజుల ముందు నుండి డెలివరీ అయిన ఆరు నెలల లోపు ఈ సెలవు ఉపయోగించుకొనవచ్చును.
  • జీవించి ఉన్న ఇద్దరు పిల్లల వరకు ఈ సెలవు మంజూరు చేయబడుతుంది.
  • ఇంక్రిమెంట్ కు, పెన్షన్ కు కౌంట్ చేయబడుతుంది.
  • శాశ్వత/తాత్కాలిక ఉద్యోగులు ఈ సెలవు పొందటానికి అర్హులు.

Memo No.20129-C/454/FR I/2010,Fin,Dt21.07.10)

G.O.Ms.No:231,Fin. (FR.I) Dept., dt; 16.09.2005





నవంబర్ 21, 2024

అసాధారణ సెలవు (EOL)

 

  • తాత్కాలిక మరియు శాశ్వత ఉద్యోగులందరికీ వర్తిస్తుంది.
  • గరిష్టంగా ఐదేళ్ళు ఉపయోగించుకొనవచ్చును
  • వ్యక్తిగత మరియు వైద్య కారణాలపై ఉపయోగించుకొనవచ్చును.
  • అసాధారణ సెలవు కాలానికి ఎటువంటి వేతనం చెల్లించబడదు. 
  • వైద్య కారణాలపై ఈ సెలవు ఉపయోగించుకొన్నచో ఇంక్రిమెంట్ లకు, పెన్షన్ కొరకు పరిగణించ బడుతుంది.
  • వ్యక్తిగత కారణాలపై ఈ సెలవు ఉపయోగించుకొన్నచో ఇంక్రిమెంట్ లకు పరిగణించ బడదు. పెన్షన్ కొరకు గరిష్టంగా మూడేళ్ళ వరకు పరిగణించబడుతుంది.
  • ఎన్ని రోజులు అసాధారణ సెలవులో ఉంటె అందులో 10 వ వంతు సంపాదిత సెలవు తగ్గించ బడుతుంది. 
  • ఏ ఇతర సెలవులు అందుబాటులో లేకపోతె ఈ సెలవు ఉపయోగించుకొనవచ్చును. ఇతర సెలవులు ఉన్నప్పటికీ ఉద్యోగి కోరితే మంజూరు చేయవచ్చును. 
  • ఉద్యోగి గైర్హాజరు అయిన కాలాన్ని డైస్ నాన్ లేదా అసాధారణ సెలవుగా పరిగణించవచ్చును. 
  • ఎ రకమైనా సెలవుతో కలిపినా గరిష్టంగా ఐదేళ్ళ వరకు ఉపయోగించుకొనవచ్చును
  • క్షయ మరియు కుష్టు వ్యాధుల వైద్యం కొరకు 18 నెలల వరకు మంజూరు చేయవచ్చును
  • కాన్సర్ మరియు మానసిక అనారోగ్యం కొరకు శాఖాధిపతి 12 నెలల వరకు మంజూరు చేయవచ్చును.
  • SC మరియు ST లకు చదువు కొరకు 24 నెలల వరకు శాఖాధిపతి మంజూరు చేయవచ్చును.
  • వైద్య కారణాలపై మంజూరు చేయబడిన అసాధారణ లీవ్ కాలాన్ని ఇంక్రిమెంట్ కొరకు పరిగణిస్తూ శాఖాధిపతి అనుమతి ఇవ్వవచ్చును. ఆరు నెలల కంటే ఎక్కువ సమయానికి అయితే ప్రభుత్వం అనుమతి ఇవ్వగలదు.

నవంబర్ 20, 2024

Allocation of subjects in Finance Department

 G.O.RT.No. 1988, Finance Dated: 20-11-2024

Sri Peeyush Kumar, IAS, Principal Finance Secretary (FAC)

    1. Overall coordination, guidance and supervision
    2. Policy matters having impact on the State’s economy and implications for the State’s finances.
    3. Matters involving relaxation of Rules, requiring the approval of the Council of Ministers, Legislative Matters.
    4. Overall supervision of matters relating to Expenditure Management, Debt and Ways & Means Management.
    5. Foreign visit matters.
    6. Finance Department Establishment Matters and office procedures.
    7. All matters not allotted to any other Secretary of the Finance Department.
    8. A.P. State Development Corporation (APSDC).

Smt. M Janaki, IAS, Secretary (Expenditure & HR)

1.       Central Devolutions, CASPs, Central and State Finance Commission.

2.       A.P. State Reorganization. 

Expenditure Management of

 

FMU-Home & Courts

Home and Courts Dept. Law Dept.

FMU-WD,CW,                       LFB&IMS               and Housing

Women Development, Child Welfare, Disabled Welfare & Senior Citizens Welfare Dept.,

Labour, Factories & Boilers and Insurance Medical Services Department & Housing Department

FMU-School Education

School Education

FMU-Higher Education,                                      Skills Development & Training

Higher Education and Skills Development and Training Department, Technical Education Department and Employment& Training HoD

FMU-PR&RD, RWS & Department of GV/WV/VS/WS

Panchayat Raj and Rural Development, RWS and Department of Gram Volunteers/ Ward Volunteers and Village Secretariats / Ward Secretariats

FMU-AC,AHDDF & CS

Agriculture & Cooperation, Animal Husbandry, Dairy Development, Fisheries and Civil Supplies

FMU-Welfare-I

Social Welfare and Tribal Welfare

FMU-Welfare-II

Backward Classes Welfare and Minority Welfare & EWS

HR

 

HR-I

Policy and Recruitment Staff  Review Committee  Implementation of Act 2 of 1994

Implementation of Act 14 of 1997

HR-II

Creation & Up gradation of posts Consultation Recruitment

HR-III

Pension & GPF

HR-IV

Fundamental Rules and Leave Rules

HR-V

Treasury and Financial Rules Employees Welfare Fund Advances & Loans Vehicle Management

 

Administration of  Pay and Account Office

 Sri D. Ronald Rose, IAS, Secretary (B&IF)

 1.       Budget Management

2.       Cash and Debt Management

3.       Institutional Finance

4.       State Level Bankers Committee & Bank Coordination

5.       AP General Insurance Corporation (APGIC)

6.       AP State Financial Services Corporation Limited.

7.       Externally Aided Projects

8.       NABARD (PMU)

9.       Public, Private Partnerships & Procurement (PMU)

10.   Administration of CFMS

11.    Internal Audit & PAC 

Expenditure Management of

 

FMU-GAD-1

State Legislature, Governor, Council of Minister, General  Administration, Elections, ITE & C, Public Enterprises.

FMU-GAD-2

Fiscal Administration, Planning, Surveys & Statistics and Information & Public Relations, Sports and Youth Affairs, Tourism, Art Culture

FMU-I&I, Energy and I&C

Infrastructure and Investment, Energy, Industries & Commerce Dept

FMU-Water Resources-I

All Medium, Minor, Drainage Wing and Flood Banks Works

FMU-WaterResources-II

All Major Irrigation Projects Works

FMU-TR&B

Transport, Roads and Buildings

FMU

TR&B

Works-other

than

W.R.

and

Subject of Works related matter of all the Depts. except WR & TR&B

 Administration of  Director of Works Accounts and Directorate of Insurance

  Sri J. Nivas, IAS, Additional Secretary (RM) and CEO APCFSS

1.  Resource Mobilisation : State Own Resources (Tax and Non-Tax)

2. Revenue Augmentation & Expenditure Optimization

3.  APSDRI.

FMU-HM&FW

HM&FW Department

FMU-MA&UD& EFS&T

Municipal Administration Urban Development, CRDA Environment, Forest and Science & Technology

FMU-Revenue

Revenue Department

 

Administration of  Director of Treasuries & Accounts, Director of State Audit.

 Note : Sri J. Nivas, IAS, Additional Secretary (RM) shall discharge the functions of Secretary(RM).

ఆదాయపు పన్ను కొత్త విధానం లో మినహాయింపులు

  • ప్రతీ ఒక్కరు డిఫాల్ట్ గా కొత్త పన్ను విధానం ఉంటారు.
  • పన్ను చెల్లింపు దారులు పాత పన్ను విధానాన్ని choose చేసుకోవచ్చు.
  • ఈ విధానం 2020 వార్షిక బడ్జెట్ లో ఇంట్రడ్యూస్ చేయబడింది.
  • ఆదాయపు పన్ను రేట్లు తక్కువ.
  • HRA, LTA, సెక్షన్ 80 C, 80 D క్రింద ఎలాంటి మినహాయింపులు లేవు.
  • అత్యధిక పన్ను రిబేటు. 7 లక్షల ఆదాయం వరకు పన్నుపై పూర్తి రిబేటు.
కొత్త  పన్ను విధానంలో ఆదాయపు పన్ను స్లాబ్స్ మరియు పన్ను రేట్లు

  • శాలరీ ఆదాయం కలిగిన వారికి 75000 వరకు స్టాండర్డ్ డిడక్షన్.
  • ఫ్యామిలీ పెన్షన్ పై 25000 వరకు స్టాండర్డ్ డిడక్షన్.
  • ఐదు కోట్ల కన్నా ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారికి సర్చార్జ్ 37% నుండి 25% కు తగ్గించబడింది.
  • Leave encashment పై గరిష్ట పరిమితి 25 లక్షలకు పెంచబడింది.

మినహాయింపులు

  • అధికారిక విధుల నిమిత్తం చెల్లించిన కన్వేయన్స్ అలవెన్స్
  • ట్రావెలింగ్ అలవెన్స్ మరియు డైలీ ఆలవెన్స్
  • విభిన్న ప్రతిభావంతులకు చెల్లించే అలవెన్స్
  • యూనిఫాం అలవేన్స్ మరియు యూనిఫాం మెయింటనెన్స్ అలవెన్స్.
  • Leave Encashment (10 AA)
  • గ్రాట్యుటీ (10)
  • APFPP/DSOP ఫండ్స్ ఫైనల్ వాల్యూ మరియు వడ్డీ (10/11)
  • Life Insurence మెచ్యూరిటీ మొత్తం (10 D)
  • కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ (10 A) 
  • ప్రావిడెంట్ ఫండ్ పై వచ్చే వడ్డీ/ withdrawals (10/12)
  • ఫ్యామిలీ పెన్షన్ పై స్టాండర్డ్ డిడక్షన్ (57 II A)
  • అగ్నివీర్ కార్పస్ ఫండ్ డిపాజిట్లు (80 CCH/2)
  • NPS ఎంప్లాయర్ కంట్రీభ్యూషన్ 

మినహాయింపు లేనివి

  • సెక్షన్ 80 C, 80 CCC, 80 CCD, 80 DDB, 80 EE, 80 EEA, 80 G, 80 IA మొదలైనవి.
  • సెక్షన్ 10 (14) నందు చెప్పబడిన అలవెన్సులు (స్పెషల్ కంపెన్సెటరీ అలవెన్స్, హై అల్టిటూడ్ ఎలవెన్స్.... మొదలైనవి)
  • ఇంటి అద్దె భత్యం (10/13 A)
  • లీవ్ ట్రావెల్ అలవెన్స్ (10/5)
  • ప్రొఫెషన్ టాక్స్ 
  • గృహ రుణం పై వడ్డీ (24 b)
  • విరాళాలు 
  • ఆస్తి విలువ తరుగుదల (32 iia)

నవంబర్ 19, 2024

Half Pay Leave

Rule 13, 14, 15, 18, 23 of AP Leave Rules, 1933

  • ప్రతీ రెగ్యులర్ ఉద్యోగికి ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసిన తరువాత 20 అర్ధ వేతన సెలవులు మంజూరు చేయబడతాయి.
  • ఎటువంటి గరిష్ట పరిమితి లేదు.
  • డ్యూటీ లో ఉన్నా, అసాధారణ సెలవు (EOL) తో సహా ఏ సెలవు లో ఉన్నా కూడా అర్ధ వేతన సెలవులు జమ చేయబడతాయి.
  • ఈ సెలవులను వ్యక్తిగత కారణాల వల్ల లేదా వైద్య కారణాల వల్ల వినియోగించుకోవచ్చు.
  • ఆరు నెలల వరకు అర్ధ వేతనం, కరువు భత్యం మరియు పూర్తి HRA, CCA చెల్లిస్తారు. ఆరు నెలల తదుపరి సెలవులో కొనసాగితే HRA, CCA చెల్లించ బడవు.
  • కుష్టు వ్యాధి, గుండె సంబంధిత వ్యాధులు, కేన్సర్, మూత్ర పిండాల వ్యాధులు, మానసిక వ్యాధులు ఉన్నవారికి 8 నెలల వరకు అర్ధ వేతన సెలవు మంజూరు చేస్తారు.
    • ఈ సందర్భంలో అర్ధ వేతన సెలవు మంజూరు చేసినప్పటికీ పూర్తి వేతనం చెల్లిస్తారు.
    • 8 నెలల వరకు HRA, CCA చెల్లిస్తారు.
  • పదవీ విరమణ సందర్భంలో సంపాదిత సెలవు 300 రోజుల కంటే తక్కువగా ఉన్న సందర్భంలో అర్ధ వేతన సెలవును నగదు గా మార్చు కొనవచ్చును. సూపర్ అన్యువేషన్, ఇన్వాలిడ్ పెన్షన్ మరియు సర్వీస్ లో ఉండగా చనిపోయిన వారు అర్హులు.
    • (హాఫ్ పే+ హాఫ్ DA)/30 * రోజుల సంఖ్య.
    • HRA, CCA చెల్లించ బడవు.

Compensatery Casual Leave

Memo.13112 Acts.67-2 Dated 1-3-58, GO.50 Dt 1-2-1968


  • ఏదైనా పబ్లిక్ హాలీడే లేదా ముందుగా మంజూరు అయినా ఐచ్ఛిక సెలవు రోజున ఉద్యోగిని విధులకు హాజరు కావాలని అదేశించినపుడు, పబ్లిక్ హాలీడేస్ నందు టర్న్  డ్యూటీ లు చేసినందుకు పరిహారంగా ఈ సెలవులు మంజూరు చేస్తారు.
  • Memo.No.13112, Acts./67-2 Dated 1-3-1958 ద్వారా ఈ సౌకర్యాన్ని పంచాయితీ సమితి మరియు జిల్లా పరిషత్ ఉద్యోగులకు వర్తింప చేసారు.
  • గరిష్టంగా ఏడాదికి 10 రోజులు ఈ సెలవు మంజూరు చేయబడుతుంది.
  • విధులకు హాజరు ఆయిన సెలవు రోజు నుండి గరిష్టంగా ఆరు నెలల లోపు ఈ సెలవును ఉపయోగించుకోవాలి. (GO.50 Dated 1-2-68 Click Here)
  • ఈ సెలవు వినియోగించుకోవడానికి తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందవలెను.
  • ఈ సెలవును క్యాజువల్ లీవ్, ఆప్షనల్ హాలీడే మరియు పబ్లిక్ హాలీడే తో కలిపి ఉపయోగించు కొనవచ్చును.
  • అవకాశం ఉన్నంత మేరకు ఆ పబ్లిక్ హాలీడే ఏదైనా మతానికి చెందినది అయితే, ఆ మతానికి చెందిన వారినీ విధులకు హాజరు అవమణి పిలవ కూడదు. (G.O.Ms.No.917, Madras Public Dept.,Dt.16.09.1902).
  • సెలవు రోజుల్లో అధికారిక పర్యటనలలో ఉన్నవారు ఈ సెలవు కి అర్హులు కారు.


 

Click Here to Download the Memo.13112 and GO.50 on CCLs

 

స్పెషల్ క్యాజువల్ లీవులు.


1

కోర్ట్ లో సాక్ష్యం చెప్పడానికి (వ్యక్తిగత ఆసక్తి కలిగినవి కాకపోతే)

అటెండెన్స్ సర్టిఫికేట్ ఆధారంగా

2

వేసెక్టమీ ఆపరేషన్ (పురుషులకు)

6 రోజులు

3

ట్యూబెక్టమీ ఆపరేషన్ (మహిళలకు)

14 రోజులు

 

2, 3 లలో చెప్పబడిన శస్త్ర చికిత్సలు విఫలమయితే రెండవసారి కూడా ఉపయోగించుకోవచ్చును  

4

భార్య ట్యూబెక్టమీ ఆపరేషన్ (పురుషులకు)

7 రోజులు

5

Insertion of Intra Uterine Contraceptive Devices

1 రోజు

6

రీకేనలైజేషన్

21 రోజులు లేదా వాస్తవంగా హాస్పిటల్ లో ఉన్న సమయం (ఏది తక్కువైతే అది)

·        ఇద్దరికన్నా తక్కువ మంది పిల్లలు ఉన్న వారికీ మాత్రమే లేదా

·        కుటుంబ నితంత్రణ ఆపరేషన్ చేయించుకున్న తరువాత పిల్లందరినీ కోల్పోయినపుడు మాత్రమే వర్తిస్తుంది.

7

Salpingectomy operation after medical Termination of Pregnancy (మహిళలకు)

14 రోజులు

8

Salpingectomy operation for Wife (పురుషులకు)

7 రోజులు

9

వేసెక్టమీ ఆపరేషన్ తదుపరి సమస్యలకు (పురుషులకు)

గరిష్టంగా 7 రోజులు

10

ట్యూబెక్టమీ ఆపరేషన్ తదుపరి సమస్యలకు (మహిళలకు)

గరిష్టంగా 14 రోజులు

11

రక్త దానం చేసిన వారికి

1 రోజు

12

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మహిళలకు)

ప్రతీ సంవత్సరం మార్చి 8 వ తేదీ

13

స్మాల్ ఫాక్స్, ప్లేగు, టైఫాయిడ్, అక్యూట్ ఇన్ఫ్లూయెంజా, న్యోమోనియా, డిఫ్తీరియా మేజల్స్, సేరేబ్రా స్పైనల్ మేనిన్గిటిస్ వంటి అంటు వ్యాధులకు

21 రోజులు (గరిష్టంగా 30 రోజుల వరకు పొడిగించ వచ్చు)

14

జాతీయ, అంతర్జాతీయ క్రేడా కార్యక్రమాలలో పాల్గొనడానికి

30 రోజులు (ఒక సంవత్సరంలో)

·        30 రోజుల కన్నా ఎక్కువ అవసరం అయితే CL మినహా ఇతర లీవులతో కలిపి వాడుకొనవచ్చును.

·        ఈ సెలవు టీం మేనేజర్లకు, కోచ్ లకు, రిఫరీ లకు కూడా వర్తిస్తుంది.

15

ఇండియన్ మౌంటేనీరింగ్ ఫౌండేషన్ వారి నిర్వహించే ట్రెక్కింగ్ కార్యక్రమాల లో పాల్గొనడానికి

30 రోజులు (ఒక సంవత్సరం లో)

16

రాష్ట్ర ప్రభుత్వం లో నియమించబడిన వికలాంగులు అయిన ఎక్స్ సర్వీస్ మెన్ లు మెడికల్ రీ సర్వే బోర్డు ముందు హాజరు కావడానికి, వైద్యం కొరకు  

15 రోజులు

17

For participating in ceremonial parades in Air defence reserve

గరిష్టంగా ఒక నెల

18

Attending for an interview, Medical Examination and Training (Reserve and Auxiliary Airforce

గరిష్టంగా ఒక నెల

19

రాష్ట్ర సచివాలయ కల్చరల్ అసోసియేషన్ సభ్యులకు

6 రోజులు (సంవత్సరంలో)

20

గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ముఖ్య కార్యవర్గ సభ్యులకు

21 రోజులు (సంవత్సరానికి)

(జిల్లాల నుండి అధ్యక్ష, కార్యదర్సులకు)

21

ఎడ్యుకేషన్, జ్యుడిషియల్ వంటి వెకేషన్ శాఖలకు

7 రోజులు (సంవత్సరానికి)

22

ఆంధ్ర ప్రదేశ్/ భారత్ స్కౌట్స్ మరియు గైడ్స్ వారు నిర్వహించే ర్యాలీలు, క్యాంపులలో పాల్గొనడానికి

10 రోజులు (సంవత్సరానికి)

23

జాతీయ, అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి

30 రోజులు (సంవత్సరానికి)

24

ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్ సభ్యులకు హైదరాబాద్ లోని వార్షిక సమావేశాలకు హాజరు కావడానికి

7 రోజులు (సంవత్సరానికి)

25

ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్ సభ్యులకు హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాల్లో జరిగే వార్షిక సమావేశాలకు హాజరు కావడానికి

10 రోజులు (సంవత్సరానికి)

26

మహిళా ఉద్యోగులకు

5 రోజులు (సంవత్సరానికి)

5 రోజులు (సంవత్సరానికి)