సెప్టెంబర్ 11, 2022

కొత్త పోస్టులు,. సృష్టించడం, పోస్టుల రద్దు మరియు సూపర్ న్యుమరరీ పోస్టుల సృష్టి

 రూల్ - 9 (ఆంధ్ర ప్రదేశ్ ఫండమెంటల్ రూల్స్ మరియు సబ్సిడరీ రూల్స్)

  • కొన్ని పోస్టులు పరిపాలన లో తాత్కాలిక అవసరాల కోసం సృష్టించబడతాయి. వాటి అవసరం తీరిన వెంటనే అవి రద్దు అవుతాయి.
  • కొన్ని పోస్టులు మంజూరు చేసి నపుడు నిర్దిష్టమైన సమయం చెప్పకపోయినా, ఆ పోస్టుల అవసరం లేనపుడు రద్దు చేయవచ్చు.
  • ఏదైనా పోస్టు ని నిర్దిష్ట సమయం వరకు మంజూరు చేసినపుడు, అందులో పని చేసే ఉద్యోగి ఆ పోస్టుని ఖాళీ చేసి ఉన్నట్లయితే ఆ పోస్టు రద్దు అయినట్లుగా పరిగణించాలి. దీనికి మంత్రి మండలి తీర్మానం అవసరం లేదు.
  • కొత్త కార్యాలయాల ఏర్పాటు, పోస్టుల సృష్టి అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారం. ఈ అధికారం వాటిని మార్చడానికి, రద్దు చేయడానికి కూడా కల్పిస్తుంది. పోస్టుల సృష్టి మరియు రద్దు చేయడం అనేది ప్రభుత్వ పరిపాలన లో భాగం. రాష్ట్ర ప్రభుత్వ విధానలపై ఆధార పడి ఉంటుంది.
  • పోస్టుల సృష్టి అనేది ప్రజా ప్రయోజనాల ఆధారంగా ఉండాలి. ఒక వ్యక్తికీ, కుటుంబానికి, వర్గానికి అనుకూలంగా ఉపాధి కలిగించేలా ఉండకూడదు.
  • ఒక పోస్టులో ఒక ఉద్యోగి పని చేస్తున్నప్పటికీ ఆ పోస్టు రద్దు కాకుండా నిలువరించే హక్కు ఉండదు. ఆ పోస్ట్ రద్దు కావడం తోనే ఆ పోస్ట్ పై అతనికి ఉన్న హక్కు కోల్పోతాడు. 
  • ప్రభుత్వానికి కన్ఫర్మ్ చేయబడిన ఉద్యోగి పని చేస్తున్న పోస్టుని కూడా రద్దు చేసే అధికారం ఉంది.ఆ శాశ్వత పోస్టులో కన్ఫర్మ్ కానీ ఉద్యోగి పని చేస్తున్నట్లయితే అతనిని దిగువ పోస్టుకి పంపడం లేదా టెర్మినేట్ చేయవచ్చు.
  • రద్దు చేసిన శాశ్వత పోస్టులో కన్ఫర్మ్ చేయబడిన ఉద్యోగి పని చేయు చున్నట్లయితే అతనిని పోస్ట్ చేయడానికి తగిన పోస్ట్ లేనట్లయితే సూపర్ న్యుమరరి పోస్ట్ క్రియేట్ చేయవచ్చును. అయితే రద్దు చేయబడిన పోస్ట్ పై లీన్ లేని ఉద్యోగి కోసం సూపర్ న్యుమరరి పోస్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు.
  • వేరే పోస్ట్ లో నియమించేటపుడు అతనికి లీన్ ఉన్న పోస్టుకి సమాన స్కేల్, క్యాడర్/ క్లాస్ కలిగిన పోస్టు అయి ఉండాలి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి