- ప్రభుత్వం ప్రత్యెక పరిస్తితులుగా పరిగణిస్తే తప్ప ఏ ప్రభుత్వ ఉద్యోగికి వరుసగా ఐదేళ్లకు మించి సెలవు మంజూరు చేయకూడదు. కేవలం అనారోగ్య కారణాల వల్ల ఆ ఉద్యోగి గైర్హాజరు అయిన సందర్భం లో, ఆ ఉద్యోగి తిరిగి విధుల్లో చేరగలడని వైద్యుల సలహా మేరకు మాత్రమే వెసులు బాటు ఇవ్వవచ్చు. మానసిక, శారీరక అనారోగ్య సమస్యల కారణంగా గైర్హాజరు అయితే ఉద్దేశ్య పూర్వక గైర్హాజరు గా పరిగణించాల్సిన అవసరం లేదు. అటువంటి సందర్భంలో ఐదేళ్లకు మించిన సెలవును అసాధారణ సెలవు (EOL) పరిగణించ వచ్చు.
- ఉద్దేశ్య పూర్వకమైన గైర్హాజరు ని డైస్ నాన్ గా పరిగణించాలి. ఈ కాలాన్ని ఇంక్రిమెంట్ కి, లీవ్ కి, పెన్షన్ కి పరిగణన లోకి తీసుకోకూడదు.
- వైద్య కారణాల పై తీసుకునే అసాధారణ సెలవు (EOL) ని 36 నెలల వరకు అర్హత గల సర్వీస్ గా పరిగణన లోకి తీసుకోవచ్చు.
- సాంకేతిక విద్య కొరకు అసాధారణ సెలవు పొందితే 36 నెలల వరకు అర్హత గల సర్వీస్ గా పరిగణన లోకి తీసుకోన వచ్చును. కాకపోతె కోర్సు పూర్తీ అయిన తరువాత 36 నెలల పాటు ప్రభుత్వ సర్వీస్ లో ఉండాలి.
- ఎవరినా ఉద్యోగి ఏడాది కన్నా ఎక్కువ కాలం గైర్హాజరు అయితే, ఆంధ్ర ప్రదేశ్ సివిల్ సర్వీస్ (CCA) రూల్స్ ని అనుసరించి ఆ ఉద్యోగికి "removal from service" పెనాల్టీ ని విధించాలి. (జివో ఎమ్మెస్ 8, ఆర్ధిక శాఖ, తేదీ.08.01.2004)
- రెగ్యులర్ ఉద్యోగి ఉద్దేశ్య పూర్వకంగా గైర్హాజరు అయితే ఆంధ్ర ప్రదేశ్ సివిల్ సర్వీస్ (CCA) రూల్స్ లోని రూల్ 20 ప్రకారం క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలి. ఆ ఉద్యోగి కి చార్జ్ మేమో జారీ చేసి కార్యాలయం లో అందుబాటులో ఉన్న తాజా చిరునామాకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాలి. ఆ ఉద్యోగి ఆ చిరునామా లో అందుబాటులో లేకపోతె ఆంధ్ర ప్రదేశ్ గజిట్ లో పబ్లిష్ చేసి ex-parte విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలి. ఆ తరువాతఅ ఉద్యోగి విధుల్లోకి వచ్చినా అతనిని విధుల్లోకి చేర్చుకుని ఒకవేళ ఆ ఉద్యోగి వైద్య కారణాలపై సెలవు పెడితే మంజూరు చేయవచ్చు. మూడు నెలలకు పైబడిన సందర్భంలో మెడికల్ బోర్డు కి రిఫర్ చేయాల్సి ఉంటుంది.
- తాత్కాలిక ఉద్యోగి ఉద్దేశ్య పూర్వకమగా విధులకు గైర్హాజరు అయితే అతనిని వెంటనే విధుల నుండి తప్పించవచ్చు.
- గైర్హాజరు అయిన ఉద్యోగి రాజీనామా సమర్పిస్తే ఆటను విధుల్లో ఉంటె రిలీవ్ చేసిన రోజు నుండి రాజీనామా చేసినట్లు గా పరిగణించాలి. సెలవులో ఉంటె రాజీనామా ను ఆమోదించిన తేదీ ని పరిగణించాలి.
- తీవ్రమైన అభియోగాలతో సస్పెన్షన్ లో ఉద్యోగి రాజీనామా ని ఆమోదించ రాదు.
- రాజీనామా ఆమోదం పొందిన తరువాత తిరిగి వెనుకకు తీసుకునే అవకాశం లేదు. ఆటను ప్రస్తుత పోస్టు లో చేసిన సర్వీస్ మాత్రమే కాకుండా, ఇప్పటివరకు వరకు చేసిన సర్వీస్ మొత్తాన్ని కోల్పోతాడు.
- ఒక ఉద్యోగి ఐదేళ్ళ పాటు సెలవులో ఉండి ఐదేళ్ళు పూర్తీ అయినా కూడా తిరిగి విధులకు రిపోర్ట్ చేయకపోతే అతనిని ఉద్యోగం నుండి తొలగించవలెను (Removal from service)
- ఒక ప్రభుత్వ ఉద్యోగి అనుమతి లేకుండా ఏడాది పాటు విధులకు గైర్హాజరు అయితే ఆ ఉద్యోగి రాజీనామా చేసినట్లుగా పరిగణించాలి.
- ప్రభుత్వం నిర్దేశించిన సమయం దాటి ఫారిన్ సర్వీస్ లో ఉండి మాతృ శాఖ కు రిపోర్ట్ చేయకపోతే ఆ ఉద్యోగి రాజీనామా చేసినట్లు గా పరిగణించాలి.
సెప్టెంబర్ 11, 2022
గైర్హాజరు (FR-18)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి