అక్టోబర్ 22, 2024

విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక యాదృచ్ఛిక సెలవు

విభిన్న ప్రతిభావంతులైన ఉద్యోగులకు ఏడాదికి ఏడు రోజుల పాటు ప్రత్యేక యాదృచ్ఛిక సెలవు ఉపయోగించుకొనుటకు అవకాశం కల్పిస్తూ 01.12.2023 న జివో ఆర్టీ నెం 138 ద్వారా ఆదేశాలు జరీ చేసింది.

వీటిని గరిష్టంగా ఏడు రోజులకు మించకుండా వాడుకొనవచ్చును.

మొత్తం సెలవు కనుక ఏడు రోజులకు మించితే ఆ పీరియడ్ నీ రెగ్యులర్ లీవ్ గా పరిగణించ వలెను.

వీటిని ఇతర సెలవులతో కలిపి వాడుకొనవచ్చును.

ఈ సెలవులను జాతీయ, రాష్ట్ర స్థాయి ఏజెన్సీ లు విభిన్న ప్రతిభావంతుల కోసం  నిర్వహించే కాన్ఫరెన్స్లు, సెమినార్లు, శిక్షణా కార్యక్రమాలు, వర్క్ షాప్ లలో పాల్గొన డానికి మంజూరు చేయవచ్చును.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి