నవంబర్ 19, 2024

Half Pay Leave

Rule 13, 14, 15, 18, 23 of AP Leave Rules, 1933

  • ప్రతీ రెగ్యులర్ ఉద్యోగికి ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసిన తరువాత 20 అర్ధ వేతన సెలవులు మంజూరు చేయబడతాయి.
  • ఎటువంటి గరిష్ట పరిమితి లేదు.
  • డ్యూటీ లో ఉన్నా, అసాధారణ సెలవు (EOL) తో సహా ఏ సెలవు లో ఉన్నా కూడా అర్ధ వేతన సెలవులు జమ చేయబడతాయి.
  • ఈ సెలవులను వ్యక్తిగత కారణాల వల్ల లేదా వైద్య కారణాల వల్ల వినియోగించుకోవచ్చు.
  • ఆరు నెలల వరకు అర్ధ వేతనం, కరువు భత్యం మరియు పూర్తి HRA, CCA చెల్లిస్తారు. ఆరు నెలల తదుపరి సెలవులో కొనసాగితే HRA, CCA చెల్లించ బడవు.
  • కుష్టు వ్యాధి, గుండె సంబంధిత వ్యాధులు, కేన్సర్, మూత్ర పిండాల వ్యాధులు, మానసిక వ్యాధులు ఉన్నవారికి 8 నెలల వరకు అర్ధ వేతన సెలవు మంజూరు చేస్తారు.
    • ఈ సందర్భంలో అర్ధ వేతన సెలవు మంజూరు చేసినప్పటికీ పూర్తి వేతనం చెల్లిస్తారు.
    • 8 నెలల వరకు HRA, CCA చెల్లిస్తారు.
  • పదవీ విరమణ సందర్భంలో సంపాదిత సెలవు 300 రోజుల కంటే తక్కువగా ఉన్న సందర్భంలో అర్ధ వేతన సెలవును నగదు గా మార్చు కొనవచ్చును. సూపర్ అన్యువేషన్, ఇన్వాలిడ్ పెన్షన్ మరియు సర్వీస్ లో ఉండగా చనిపోయిన వారు అర్హులు.
    • (హాఫ్ పే+ హాఫ్ DA)/30 * రోజుల సంఖ్య.
    • HRA, CCA చెల్లించ బడవు.

3 కామెంట్‌లు: