రూల్ 74 లోని అనుబంధం-2 లో నిర్దేశించిన ఫారం-10 ప్రకారం సర్వీసు రిజిష్టరు నిర్వహించ వలెను.
G.O.Ms.No.165 F&P తేది:21-4-1984 ప్రకారం పుట్టినతేది మార్చుటకు వీలులేదు.
బదిలీ అయిన Non-Gazetted ఉద్యోగి చేతికి సర్వీసు రిజిష్టరు ఇచ్చి పంపకూడదు (Sub Rule 07 of Annexure - II)
సర్వీసు రిజిష్టరు నందు, సర్వీసు వివరములను నమోదు చేయుటకు పెన్సిల్ ను వాడరాదు (Govt.Memo.No.72246 Dt:30-07-1966)
GO.Ms.No:03 Fin., Dt:08-01-1969 ప్రకారం సర్వీస్ చేరుటకు తప్పనిసరి గా Physical Fitness Certificate సమర్పించవలెను.
Rule 8, clause (b)(i) of APLTC Rules ప్రకారం Leave Travel Concession పొందుటకు ఉద్యోగి తన Home Town డిక్లేరేషన్ ఇవ్వాలి.
GO.Ms.No:15 Fin & Plg dept, Dt:17/01/1973 ప్రకారం LTC పొందినపుడు ప్రయాణ తేదీలను మరియు ఉద్యోగితో పాటుగా సౌలభ్యమును పొందిన కుటుంబ సభ్యులందరి వివరములను సర్వీసు రిజిష్టరు నందు నమోదు చేయవలెను.
Memo.No:51073/Ser/C 2002-1 GAD, dated 19-12-2002 ప్రకారం ఉద్యోగి పై తీసుకున్న క్రమ శిక్షణా చర్యలను సర్వీసు రిజిష్టరు నందు నమోదు చేయాలి.
G.O.Ms.No.80 తేది:19-3-2008 ప్రకారం ఉద్యోగి ట్రెజరీ ID నెంబర్ ను మొదటి పేజీనందు నమోదుచేయాలి.
G.O.Ms.No.152 Fin తేది:20-5-1969 ప్రకారం సర్వీసు రిజిష్టరు ను ప్రతి సంవత్సరం ఉద్యోగికి పరిశీలనార్ధము మరియు ధృవపరుచుకొనుటకు గాను ఇవ్వవలెను.
జూన్ నెల వేతన బిల్లు తో ప్రతి సంవత్సరము ఉద్యోగి సర్వీసు రిజిష్టరును Verify చేసినట్లుగా కార్యాలయాధిపతి ఏ నెల వేతన బిల్లు తో Certificate ఇవ్వవలెను. ఉద్యోగి సర్వీసు రిజిష్టరును Verify చేసినట్లుగా కార్యాలయాధిపతి Certificate జతచేయని యెడల వేతన బిల్లులు ట్రెజరీ అధికారి ఆమోదించకూడదని నిర్ధేశించిన ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. (Memo No: 74538 - A/ Accts /1614/ 69, dated:25/05/1971)
G.O.Ms.No. 21 F & P dept. dt. 25-1-1977 ప్రకారం, Drawing Officer కు చెందిన సర్వీసు రిజిష్టరును తన కార్యాలయంలో నిర్వహించ వలెను.
GO.Ms.No:216 GAD dated:22/06/1964 ప్రకారం, సర్వీసు రిజిష్టరు కు నకలు రిజిష్టరును నిర్వహించు ఉద్యోగులు నిర్వహించుకోవచ్చు.
సర్వీసు రిజిష్టరు ఏవైనా కారణాల వలన లభ్యం కాని యెడల GO.Ms.No:202 F & P (PW.PS-I) department dt:11/06/1980 ప్రకారం సర్వీసు రిజిష్టరును పునః నిర్మాణము చేసి నిర్వహించాలి. సర్వీసు రిజిష్టరు పునః నిర్మాణము చేయునప్పుడు ఉద్యోగి సమర్పించే వివరములతో పాటుగా Affidavit తీసుకొనవలసి ఉంటుంది.
Rule 3 (c) of A.P. Revised Pension Rules 1980, ఉద్యోగి పదవీ విరమణ తేదీకి రెండు సంవత్సరములు ముందుగా అతని సర్వీసు రిజిష్టరు నందు నమోదు కాబడిన అన్ని సర్వీసు సంఘటనలను ధృవీకరించికొని సర్వీసు వెరిఫికేషన్ సర్టిఫికేట్ నమోదు చేయాలి.
GO.Ms.No:200 F&P (FW.II) dept, Dt:10-12-1999 ప్రకారం సర్వీసు రిజిష్టరు నందు ఉద్యోగి యొక్క ఫోటో అతికించవలెను.
GO.Ms.No:391 Fin & Plg dept, Dt:07/11/1977 ప్రకారం సర్వీసు రిజిష్టరు ను ఉచితంగా ప్రభుత్వమే నిర్వహించ వలెను.
G.O.Ms.No.99 FINANCE (HR-II-FR) DEPARTMENT, Dated: 27-06-2018 ప్రకారం e- Service Registers ను maintain చేయాలి.