- ప్రభుత్వం ప్రత్యెక పరిస్తితులుగా పరిగణిస్తే తప్ప ఏ ప్రభుత్వ ఉద్యోగికి వరుసగా ఐదేళ్లకు మించి సెలవు మంజూరు చేయకూడదు. కేవలం అనారోగ్య కారణాల వల్ల ఆ ఉద్యోగి గైర్హాజరు అయిన సందర్భం లో, ఆ ఉద్యోగి తిరిగి విధుల్లో చేరగలడని వైద్యుల సలహా మేరకు మాత్రమే వెసులు బాటు ఇవ్వవచ్చు. మానసిక, శారీరక అనారోగ్య సమస్యల కారణంగా గైర్హాజరు అయితే ఉద్దేశ్య పూర్వక గైర్హాజరు గా పరిగణించాల్సిన అవసరం లేదు. అటువంటి సందర్భంలో ఐదేళ్లకు మించిన సెలవును అసాధారణ సెలవు (EOL) పరిగణించ వచ్చు.
- ఉద్దేశ్య పూర్వకమైన గైర్హాజరు ని డైస్ నాన్ గా పరిగణించాలి. ఈ కాలాన్ని ఇంక్రిమెంట్ కి, లీవ్ కి, పెన్షన్ కి పరిగణన లోకి తీసుకోకూడదు.
- వైద్య కారణాల పై తీసుకునే అసాధారణ సెలవు (EOL) ని 36 నెలల వరకు అర్హత గల సర్వీస్ గా పరిగణన లోకి తీసుకోవచ్చు.
- సాంకేతిక విద్య కొరకు అసాధారణ సెలవు పొందితే 36 నెలల వరకు అర్హత గల సర్వీస్ గా పరిగణన లోకి తీసుకోన వచ్చును. కాకపోతె కోర్సు పూర్తీ అయిన తరువాత 36 నెలల పాటు ప్రభుత్వ సర్వీస్ లో ఉండాలి.
- ఎవరినా ఉద్యోగి ఏడాది కన్నా ఎక్కువ కాలం గైర్హాజరు అయితే, ఆంధ్ర ప్రదేశ్ సివిల్ సర్వీస్ (CCA) రూల్స్ ని అనుసరించి ఆ ఉద్యోగికి "removal from service" పెనాల్టీ ని విధించాలి. (జివో ఎమ్మెస్ 8, ఆర్ధిక శాఖ, తేదీ.08.01.2004)
- రెగ్యులర్ ఉద్యోగి ఉద్దేశ్య పూర్వకంగా గైర్హాజరు అయితే ఆంధ్ర ప్రదేశ్ సివిల్ సర్వీస్ (CCA) రూల్స్ లోని రూల్ 20 ప్రకారం క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలి. ఆ ఉద్యోగి కి చార్జ్ మేమో జారీ చేసి కార్యాలయం లో అందుబాటులో ఉన్న తాజా చిరునామాకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాలి. ఆ ఉద్యోగి ఆ చిరునామా లో అందుబాటులో లేకపోతె ఆంధ్ర ప్రదేశ్ గజిట్ లో పబ్లిష్ చేసి ex-parte విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలి. ఆ తరువాతఅ ఉద్యోగి విధుల్లోకి వచ్చినా అతనిని విధుల్లోకి చేర్చుకుని ఒకవేళ ఆ ఉద్యోగి వైద్య కారణాలపై సెలవు పెడితే మంజూరు చేయవచ్చు. మూడు నెలలకు పైబడిన సందర్భంలో మెడికల్ బోర్డు కి రిఫర్ చేయాల్సి ఉంటుంది.
- తాత్కాలిక ఉద్యోగి ఉద్దేశ్య పూర్వకమగా విధులకు గైర్హాజరు అయితే అతనిని వెంటనే విధుల నుండి తప్పించవచ్చు.
- గైర్హాజరు అయిన ఉద్యోగి రాజీనామా సమర్పిస్తే ఆటను విధుల్లో ఉంటె రిలీవ్ చేసిన రోజు నుండి రాజీనామా చేసినట్లు గా పరిగణించాలి. సెలవులో ఉంటె రాజీనామా ను ఆమోదించిన తేదీ ని పరిగణించాలి.
- తీవ్రమైన అభియోగాలతో సస్పెన్షన్ లో ఉద్యోగి రాజీనామా ని ఆమోదించ రాదు.
- రాజీనామా ఆమోదం పొందిన తరువాత తిరిగి వెనుకకు తీసుకునే అవకాశం లేదు. ఆటను ప్రస్తుత పోస్టు లో చేసిన సర్వీస్ మాత్రమే కాకుండా, ఇప్పటివరకు వరకు చేసిన సర్వీస్ మొత్తాన్ని కోల్పోతాడు.
- ఒక ఉద్యోగి ఐదేళ్ళ పాటు సెలవులో ఉండి ఐదేళ్ళు పూర్తీ అయినా కూడా తిరిగి విధులకు రిపోర్ట్ చేయకపోతే అతనిని ఉద్యోగం నుండి తొలగించవలెను (Removal from service)
- ఒక ప్రభుత్వ ఉద్యోగి అనుమతి లేకుండా ఏడాది పాటు విధులకు గైర్హాజరు అయితే ఆ ఉద్యోగి రాజీనామా చేసినట్లుగా పరిగణించాలి.
- ప్రభుత్వం నిర్దేశించిన సమయం దాటి ఫారిన్ సర్వీస్ లో ఉండి మాతృ శాఖ కు రిపోర్ట్ చేయకపోతే ఆ ఉద్యోగి రాజీనామా చేసినట్లు గా పరిగణించాలి.
సెప్టెంబర్ 11, 2022
గైర్హాజరు (FR-18)
Earned Leave
- తాత్కాలిక మరియు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఈ సెలవు పొందటానికి అర్హులు
- తాత్కాలిక ఉద్యోగులకు ప్రతీ ఆరు నెలలకు అడ్వాన్సుగా (జనవరి & జూలై) 8 రోజులు జమ చేయబడతాయి.
- శాశ్వత ఉద్యోగులకు ప్రతీ ఆరు నెలలకు అడ్వాన్సుగా (జనవరి & జూలై) 15 రోజులు జమ చేయబడతాయి.
- వెకేషన్ డిపార్టుమెంటు లలో పని చేసే వారికి ప్రతీ ఆరు నెలలకు అడ్వాన్సుగా 3 రోజులు జమ చేయబడతాయి.
- ఈ లీవ్ జమ చేయడానికి రోజులు ఉన్న నెలల్ని వదలి పెట్టి పూర్తీ గా సర్వీస్ చేసిన నెలలను పరిగణన లోకి తీసుకుంటారు.
- ఒక ఉద్యోగి సంవత్సరం మధ్యలో చేరినట్లయితే మొదటి రెండు నెలలకు ఒక్కొక్క రోజు, ప్రతీ మూడవ నెలకు రెండు రోజులు జమ చేస్తారు, ఉదాహరణకు ఒక ఉద్యోగి ఫిబ్రవరి 12 వ తేదీన తాత్కాలిక ప్రాతిపదికన చేరితే
- ఫిబ్రవరి కి "0"
- మార్చి కి ఒక రోజు
- ఏప్రిల్ కి ఒక రోజు
- మే కి రెండు రోజులు
- జూన్ కి ఒక రోజు చొప్పున మొత్తం ఐదు రోజులు అడ్వాన్సుగా జమ చేస్తారు
- ఎవరైనా ఉద్యోగి కొంత కాలం జీత నష్టపు సెలవు (EOL) లో ఉన్నట్లయితే తదుపరి అర్ధ సంవత్సరానికి ఎంతకాలం EOL లో ఉంటె అందులో పదో వంతు EL తగ్గించాలి (గరిష్టంగా శాశ్వత ఉద్యోగులకు 15, తాత్కాలిక ఉద్యోగులకు 8 రోజులు తగ్గించాలి)
- ఉదాహరణకు ఒక ఉద్యోగి జూలై నుండి డిసెంబర్ మధ్యలో 67 రోజులు EOL లో ఉన్నట్లయితే తదుపరి జనవరి నెలలో జమ చేసే 15 రోజులలో 7 రోజులు తగ్గించి 8 రోజులు జమ చేయాలి.
- గరిష్టంగా నిల్వ ఉండే సంపాదిత సెలవు ౩00 రోజులు (16.09.2005 నుండి)
- 01.06.1964 నుండి 30.06.1983 గరిష్ట నిల్వ పరిధి 180 రోజులు
- 01.07.1983 నుండి 15.09.2005 మధ్యలో గరిష్ట నిల్వ పరిధి 240 రోజులు
- వైద్య కారణాలపై లేదా వ్యక్తిగత కారణాలతో ఒకేసారి గరిష్టంగా ఆరు నెలలు దాటకుండా ఉపయోగించుకోవచ్చు. (నాల్గవ తరగతి ఉద్యోగులు అయితే 120 రోజులు)
- CL మినహా ఇతర లీవులతో కలిపి ఉపయోగించుకోవచ్చు.
- పబ్లిక్ హాలిడే, ఆప్షనల్ హాలిడే, CCL లని సఫిక్స్ లేదా ప్రిఫిక్స్ గా ఉపయోగించుకోవచ్చు.
- ఆరు నెలల వరకు అన్ని రకాల అలవెన్సులు తో పూర్తి జీతం పొందవచ్చు. ఆరు నెలల తరువాత HRA, CCA చెల్లించారు.
- నిల్వ ఉన్నా సంపాదిత సెలవు ని సరెండర్ చేసుకుని దానికి సమానమైన నగదు పొందవచ్చు.
- 15 రోజులు సరెండర్ చేసుకోవడానికి 12 నెలల విరామం, 30 రోజులు సరెండర్ చేసుకోవడానికి 24 నెలల విరామం అవసరం.
- సంపాదిత సెలవు నిల్వ కనుక 285 రోజుల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే 12 నెలల గ్యాప్ లేకపోయినా 15 రోజులు సరెండర్ చేసుకోవచ్చు.
- ఒక ఆర్ధిక సంవత్సరంలో ఒకేసారి ఈ సౌకర్యం ఉపయోగించుకోవచ్చు.
- తాత్కాలిక ఉద్యోగులు కూడా 24 నెలల విరామం తరువాత 15 రోజులు సరెండర్ చేసుకోవచ్చు.
- మంజూరు ఉత్తర్వులు మంజూరు చేసిన తేదీ నుండి 90 రోజుల వరకు చెల్లుబాటు అవుతాయి.
- పదవీ విరమణ పొందినపుడు లేదా సర్వీస్ లో ఉండగా చనిపోయినా ఉద్యోగి సంపాదిత ఖాతాలో ఉన్న నిల్వలు సమానమైన మొత్తాన్ని నగదు గా చెల్లిస్తారు (గరిష్టంగా ౩00 రోజులు)
- ప్రభుత్వ క్వార్టర్ల లో ఉండేవారికి HRA చెల్లించవచ్చు.
- కన్వేయన్స్ అలవెన్సు, IR లు చెల్లించబడవు.
- తాత్కాలిక ఉద్యోగులుగా చేరిన వారి సర్వీస్ రెగ్యులరైజ్ అయ్యాక లీవులను రీకాస్ట్ చెయ్యాలి
కొత్త పోస్టులు,. సృష్టించడం, పోస్టుల రద్దు మరియు సూపర్ న్యుమరరీ పోస్టుల సృష్టి
రూల్ - 9 (ఆంధ్ర ప్రదేశ్ ఫండమెంటల్ రూల్స్ మరియు సబ్సిడరీ రూల్స్)
- కొన్ని పోస్టులు పరిపాలన లో తాత్కాలిక అవసరాల కోసం సృష్టించబడతాయి. వాటి అవసరం తీరిన వెంటనే అవి రద్దు అవుతాయి.
- కొన్ని పోస్టులు మంజూరు చేసి నపుడు నిర్దిష్టమైన సమయం చెప్పకపోయినా, ఆ పోస్టుల అవసరం లేనపుడు రద్దు చేయవచ్చు.
- ఏదైనా పోస్టు ని నిర్దిష్ట సమయం వరకు మంజూరు చేసినపుడు, అందులో పని చేసే ఉద్యోగి ఆ పోస్టుని ఖాళీ చేసి ఉన్నట్లయితే ఆ పోస్టు రద్దు అయినట్లుగా పరిగణించాలి. దీనికి మంత్రి మండలి తీర్మానం అవసరం లేదు.
- కొత్త కార్యాలయాల ఏర్పాటు, పోస్టుల సృష్టి అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారం. ఈ అధికారం వాటిని మార్చడానికి, రద్దు చేయడానికి కూడా కల్పిస్తుంది. పోస్టుల సృష్టి మరియు రద్దు చేయడం అనేది ప్రభుత్వ పరిపాలన లో భాగం. రాష్ట్ర ప్రభుత్వ విధానలపై ఆధార పడి ఉంటుంది.
- పోస్టుల సృష్టి అనేది ప్రజా ప్రయోజనాల ఆధారంగా ఉండాలి. ఒక వ్యక్తికీ, కుటుంబానికి, వర్గానికి అనుకూలంగా ఉపాధి కలిగించేలా ఉండకూడదు.
- ఒక పోస్టులో ఒక ఉద్యోగి పని చేస్తున్నప్పటికీ ఆ పోస్టు రద్దు కాకుండా నిలువరించే హక్కు ఉండదు. ఆ పోస్ట్ రద్దు కావడం తోనే ఆ పోస్ట్ పై అతనికి ఉన్న హక్కు కోల్పోతాడు.
- ప్రభుత్వానికి కన్ఫర్మ్ చేయబడిన ఉద్యోగి పని చేస్తున్న పోస్టుని కూడా రద్దు చేసే అధికారం ఉంది.ఆ శాశ్వత పోస్టులో కన్ఫర్మ్ కానీ ఉద్యోగి పని చేస్తున్నట్లయితే అతనిని దిగువ పోస్టుకి పంపడం లేదా టెర్మినేట్ చేయవచ్చు.
- రద్దు చేసిన శాశ్వత పోస్టులో కన్ఫర్మ్ చేయబడిన ఉద్యోగి పని చేయు చున్నట్లయితే అతనిని పోస్ట్ చేయడానికి తగిన పోస్ట్ లేనట్లయితే సూపర్ న్యుమరరి పోస్ట్ క్రియేట్ చేయవచ్చును. అయితే రద్దు చేయబడిన పోస్ట్ పై లీన్ లేని ఉద్యోగి కోసం సూపర్ న్యుమరరి పోస్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు.
- వేరే పోస్ట్ లో నియమించేటపుడు అతనికి లీన్ ఉన్న పోస్టుకి సమాన స్కేల్, క్యాడర్/ క్లాస్ కలిగిన పోస్టు అయి ఉండాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)